శ్రీ దత్తాత్రేయుని 24 మంది గురువులు
🌻. ప్రసాద్ భరద్వాజ దత్తాత్రేయుని సాక్షాత్తూ ఆ త్రిమూర్తుల అవతారంగా భావిస్తుంటాము. కోరి చెంతకు చేరిన మూఢుని సైతం బ్రహ్మజ్ఞానిగా మార్చగల ఆ దత్తాత్రేయునికి గురువు ఎవరై ఉంటారు అని ప్రశ్నస్తే... తాను ప్రకృతిలో గమనించిన 24 గురువుల నుంచి జ్ఞానాన్ని సంపాదించానని పేర్కొంటారు. ఆధ్మాత్మిక తత్వాన్ని గ్రహించాలనుకునే జ్ఞానసాధకులకైనా, భక్తి యోగాన్ని అనుసరించే జీవులకైనా, సంసారంలోనే ఉంటూనే కర్మయోగంతో మోక్షాన్ని సాధించాలనుకునే ముముక్షువలకైనా... ఇహపర తృప్తిని అందించగల దైవం దత్తాత్రేయుడు. ఎటువంటి గురుబోధా లేకుండానే ప్రకృతిని పరిశీలించడంతోనే ఆయన సిద్ధగురువుగా అవతరించారంటారు. ఆ 24 గురువులనీ ఒక్కసారి స్మరిస్తే... వాటి నుంచి మనకి కూడా ఎంతో కొంత స్థిరచిత్తత అలవడుతుందని ఇక్కడ ఇవ్వడం జరుగుతోంది. మరి ఆ గురువులలో ఎవరి నుంచి ఏం నేర్చుకున్నారంటే... 🌻 1. భూమి- క్షణమైనా తన బాధ్యతని విస్మరించని నిబద్ధత. పరులు కీడు తలపెట్టినా తిరిగి ఆహారాన్ని అందించగల క్షమ. ఎంతటి బాధనైనా ఓర్చుకోగల సహనం. 🌻 2. గాలి - తనలో ఎన్ని భావాలు మెదులుతున్నా వేటినీ...