Posts

Showing posts from January, 2020

స్వామి దత్తాత్రేయ విరచిత ఆత్మ జ్ఞాన యోగము

6. మోక్షానికి సాధనము : మోక్షం సాధించాలంటే తత్పరత్వము కావాలి. అది ఉంటే ఇతర సాధనలు ఏవీ అవసరం లేదు. 'తత్పరత్వము' అంటే - దానియందు శ్రద్ద, మోక్షాన్ని సాధించి తీరుతాను అనే పట్టుదల. సాధించాలి అనే తీవ్రజిజ్ఞాస. అది ఉన్నవాడికి, బుద్దిలోని నిర్మలత్వాన్నిబట్టి కొంచెం ముందు వెనుకలుగా ఫలితం లభిస్తుంది. బుద్దికి అనేక దోషాలున్నాయి. అవే పురుషార్థాలను నాశనం చేస్తాయి. అందువల్లనే మానవుడు సంసారబంధనాలలో పడిచిక్కుకుపోతున్నాడు. ఈ దోషాలలో ముఖ్యమైనవి.     1. గురువాక్యం మీద (శ్రద్ధ లేకపోవటం (అవిశ్వాసము)    2, కామవాసన 3. చిత్తమౌధ్యము.    1. అవిశ్వాసం ; ఇది రెండు రకాలు : 1) సంశయము, 2) విపర్యయము    మోక్షమున్నదో, లేదో అనేది సంశయం. మోక్షం లేనే లేదు అనేది విపర్వ్యయం. తత్పరత్వం రావాలంటే ఈ రెండూ ఉండకూడదు. ఇక్కడ నిశ్చయ జ్ఞానమే కావాలి. మోక్షమున్నది. అంతే అసలు తర్మమే అవిశ్వాసానికి మూలం. అందుకు తరాన్ని వదిలిపెట్టాలి. అప్పుడు నిశ్చయబుద్ది కలుగుతుంది. శాస్తాలయందు విశ్వాసం కలుగుతుంది.    2 కామవాసన : ఇదే ఐహిక వాంఛ. ఇహలోక సుఖాలమీద కోరికలున్నప్పుడు మోక్షంమీద అపేక్ష ఉండదు. అంద...