Posts

Showing posts from January, 2022

సొంటి చేసే మేలు

సర్వరోగ నివారిణి. మహా ఓషది శొంఠి. 👉అల్లం ను బాగా కడిగి సున్నపుతేటలో ముంచి ఎండబెడితే సొంఠిగా మారుతుంది. 👉 ఈ భూమి మీద ,  అనేక రోగాలను ధ్వంసం చేయగల మహా మహా మూలికలలో ఈ శొంఠి అనేది ఒకటి. 👉దీనిలోని అపూర్వమైన గుణాలను తెలుసుకున్న మన మహర్షులు దీని శక్తికి ఆశ్చర్యపోయి దీనికి మహా ఓషది అని అర్థం వచ్చేటట్లుగా విశ్వభేషజo అని సంస్కృతంలో  నామకరణం చేశారు 👉దీనిని లోనికి వాడిన తర్వాత ఇది శరీరం అంతా వ్యాపించి ప్రతి అవయవాన్ని మృదువుగా, లోపరహితంగా చేయడానికి తోడ్పడుతుంది. మానవునిలో జీవనశక్తిని ( వ్యాధినిరోధక శక్తి) వృద్ధి చేస్తుంది.  👉కడుపు ఉబ్బరాన్ని, గ్యాస్ ని తగ్గిస్తుంది. 👉మూత్రపిండ రోగాలను తగ్గిస్తుంది. 👉పురుషులకు వీర్యవృద్ధి చేస్తుంది. 👉శ్వాశ రోగాలను, ఉదరశూలాలను, దగ్గులను, హృదయ రోగములను, బోదకాలను, వాత రోగములను తగ్గిస్తుంది. 👉ఉదరములో గ్యాస్ ఎక్కువైనపుడు గుండెలో నొప్పి వస్తుంది. ఈ సమస్య కోసం పావు చెంచా శొంఠిపొడిని ఒక చెంచా తేనెతో కలిపి సేవిస్తూ ఉంటే గ్యాస్ తగ్గిపోయి గుండెనొప్పి కూడా తగ్గుతుంది. 👉దోరగా వేయించిన శొంఠి పొడిని మేక పాలతో కలిపి సేవిస్తే విష జ్వరాలు తగ్గిపోతాయి. 👉ఒకవైపు...