నేల ఉశిరిక చెట్టు గురించి సంపూర్ణ వివరణ - ఔషధోపయోగాలు .

   నేల ఉశిరిక చెట్టును సంస్కృతంలో భూమ్యామలి , తమాలి , తాలి , తమాలికా , ఉచ్చట అని పిలుస్తారు .  ఆంగ్లము నందు Phyllanthus Amarus అని పిలుస్తారు . దీనిలో చాలారకాలు ఉన్నాయి . మనం ఔషధాల కొరకు ఉపయోగించునది సన్నని తెలుపుగల జీలగ ఆకుల వంటి ఆకులు , ఆకుల కింద సన్నని గట్టి కాయలు గల దానిని కొందరు , పొడవుగా కొంచం నలుపు రంగుగా ఉండు ఆకులు కలిగి , ఆకుల కింద కాయలు గల దానిని కొందరు వాడుదురు. రెండింటిలో జీలగ ఆకుల వంటి కురచ ఆకులది శ్రేష్టము. ఈ మొక్కలో సర్వాంగములు ఔషధోపయోగమే . ఇది ఎల్లప్పుడూ విరివిగా దొరుకును . దీనిలో ఎరుపు , తెలుపు కాడలు కలిగినవి కూడా ఉండును. ఎరుపు కాడ కలిగినదానిని రసవాదం నందు ఉపాయోగిస్తారు. తెల్ల కాడ కలిగిన దానితో సత్తు , వంగము , తాళకం వంటి లోహాలను భస్మం చేయుటకు ఉపయోగిస్తారు .

ఔషధోపయోగములు  -

*  రక్తప్రదరం అనగా స్త్రీలలో అధిక రక్తస్రావం కావడం . ఈ సమస్య ఉన్నవారు నేల ఉశిరిక గింజలను బియ్యపు కడుగుతో నూరి రెండు లేక మూడు దినములు సేవించిన రక్తప్రదరం తగ్గును. వేడి చేసే వస్తువులు తినకూడదు.

*  వరసగా వచ్చు ఎక్కిళ్లు నివారణ కొరకు నేల ఉశిరిక చూర్ణమును పంచదారతో కలిపి తినినను లేక నేల ఉశిరిక రసమును రసం ముక్కు దగ్గర పెట్టుకుని గట్టిగా లోపలికి నశ్యము చేసినను ఎక్కిళ్లు ఆగిపోవును .

*  కంటి సమస్యలతో ఇబ్బంది పడువారు నేల ఉశిరిక , సైన్ధవ లవణం రాగిరేకు యందు కాంజీకంతో నూరి నేత్రముల చుట్టూ పట్టువేసిన నేత్ర బాధలు అన్నియు శమించును . ఈ కాంజీకం ఆయుర్వేద దుకాణాల్లో లభ్యం అగును.

*  వ్రణాలతో ఇబ్బంది పడువారు నేల ఉశిరిక రసంలో పసుపు చూర్ణం కలిపి పుండ్లపైన రాయుచున్న అవి మాడిపోవును.

*  స్త్రీలకు ఋతు సమయంలో వచ్చు నొప్పికి 25 గ్రాముల నేల ఉశిరిక రసములో 40 మిరియపు గింజల చూర్ణం కలిపి మూడోవ రుతుదినమున సేవించిన రుతుశూల , సరిగ్గా ఋతురక్తం జారీ కాకపోవటం వంటి సమస్యలు తగ్గును.

*  ఉబ్బుకామెర్ల సమస్యతో బాధపడువారు నేల ఉశిరిక నీడన ఎండించి చూర్ణం చేసినది లేదా నేల ఉశిరి సమూల రసం పెరుగులో కలిపి కాని గోమూత్రంలో కలిపి కాని లోపలికి ఇవ్వవలెను . రసము మోతాదు 25 గ్రాములు .

*  శరీరం పైన లేచు దద్దుర్లకు దీని ఆకును పుల్లటి మజ్జిగతో నూరి శరీరానికి పూసిన శరీరం పైన దద్దురులు నయం అగును.

*  మధుమేహంతో బాధపడువారు నేల ఉశిరి రసం , మంచి పసుపు, నేరేడు గింజల చూర్ణం కలిపి శనగ గింజలంత మాత్రలు చేసి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి చొప్పున వాడుచున్న మధుమేహం అదుపులోకి వచ్చును.

*  జిగట విరేచనాలతో ఇబ్బంది పడువారు నేల ఉశిరి చూర్ణం , మెంతులు చూర్ణం కలిపి అరచెంచా చొప్పున మజ్జిగలో కలిపి తీసుకొనుచున్న జిగట విరేచనాలు తగ్గును.

*  శరీరంలో రక్తహీనత వల్ల వొళ్ళంతా తెల్లగా పాలిపోయే పాండురోగ రోగులు నేల ఉశిరి వేర్లను  10 గ్రా మోతాదుగా మెత్తగా నూరి రసం తీసి అరగ్లాసు నాటు ఆవుపాలలో కలిపి రెండుపూటలా ఆహారానికి గంట ముందు సేవిస్తుంటే క్రమంగా పాండురోగం హరించిపోయి రక్తవృద్ధి, రక్తశుద్ది జరుగును.

      
    గమనిక  -

       నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషదాలు " అనే గ్రంథం నందు పెద్ద పెద్ద రోగాలకు కూడా అత్యంత సులభ చిట్కాలతో నయం చేసుకునే విధముగా ఇవ్వడం జరిగింది.  రోగ కారణాలు , ఔషధాలు , పత్యాలు అన్ని ఒకేచోట ఇచ్చాను.

           ఈ గ్రంథంలో అన్ని వైద్య యోగాలు ఇంట్లో ఉన్న వస్తువులు మరియు ఇంటి చుట్టుపక్కల దొరికే మూలికలతో సొంతంగా ఇంట్లొనే తయారుచేసుకునే విధంగా ఇవ్వడం జరిగింది. మొక్కలను సులభంగా గుర్తించుటకు రంగుల ఫొటోస్ ఇచ్చాను. ఆయుర్వేదం పైన అవగాహన ఏర్పరచుకోవాలి మరియు ఆయుర్వేదం నేర్చుకునే వారికి చక్కటి మార్గ సూచీ అవుతుంది. గ్రాంధిక భాష కాకుండా మనం వాడే సాధారణ భాష లో ఉంటుంది.

        చెట్లను బట్టి భూమి యందు నీటిని కనుగొనే విధానం , వ్యవసాయంలో అధిక ఫలితాలు సాధించుటకు వృక్షాయుర్వేదం అను ప్రాచీన రహస్య యోగాలు గురించి , పశువుల వైద్య యోగాలు వంటి ఎన్నో అమూల్యమయిన విషయాలు తెలియచేశాను . గ్రంథం మొత్తం 288 పేజీలు ఉంటుంది. ఈ అమూల్య గ్రంథం విలువ 350 రూపాయిలు మాత్రమే .

    కేవలం ఆరు నెలలోపే ద్వితీయ ముద్రణ కు వచ్చిన ఈ గ్రంథం కావలసిన వారు డైరెక్టుగా మాత్రమే సంప్రదించగలరు. గత 250 సంవత్సరాల నుంచి మా వంశపారంపర్యంగా వచ్చిన అనుభవ రహస్య వైద్య యోగాలు ఈ గ్రంథంలో సంపూర్ణంగా వివరించాను.

   ఈ గ్రంథం కావలసిన వారు డైరెక్టుగా ఫొన్ ద్వారా మాత్రమే సంప్రదించగలరు.  సంప్రదించవలసిన నెంబర్

                      9885030034 

 
                కాళహస్తి వెంకటేశ్వరావు

            అనువంశిక ఆయుర్వేద వైద్యం

                      9885030034

Comments

Popular posts from this blog

మంత్రశక్తి గురించి వివరణ - మంత్రసిద్ధి

సొంటి చేసే మేలు

ఉప్పుకు ప్రత్యామ్నాయం సైన్డవలవనం