పేగుల్లో పురుగుల నశించుటకు సిద్ద యోగాలు
* గాడిదగడపాకు రసాన్ని పూటకు రెండు చెంచాలు చొప్పున రెండు రోజులపాటు వాడితే పేగుల్లోని పురుగులు అన్ని పోతాయి.
* వేపాకు రసంలో కొంచెం ఉప్పు కలిపి తాగుతున్న అన్ని రకాల పురుగులు పోతాయి .
* రాచ ఉశిరికాయలు ప్రతినిత్యం 6 చొప్పున తినుచున్న అన్నిరకాల పురుగులు నశించును. వారంపాటు విడవకుండా తినవలెను .
* రోజుకి ఒకసారి పావు చెంచా వస చూర్ణాన్ని కప్పు నీటిలో కలిపి తాగవలెను. అలా మూడురోజుల పాటు సేవించవలెను . ఈ విధంగా వాడలేనివారు తేనెతో కలిపి తీసుకొనవచ్చు .
* కప్పు నీటిలో 20 చుక్కల వెల్లుల్లిపాయ రసం కలిపి తాగాలి. అలా రోజుకి రెండుపూటలా మూడురోజుల పాటు తాగితే అన్నిరకాల పురుగులు పోతాయి .
* వేపపండ్లు దొరికే కాలంలో ఒక వారంపాటు వేపపండ్లు తినవలెను .
* రోజుకి రెండుసార్లు కొంచం పంచదార మీద నాలుగు చుక్కలు వేపనూనె వేసుకొని నోట్లొ వేసి నీటితో మింగవలెను. అలా మూడు రోజులపాటు చేస్తే క్రిములు నశిస్తాయి.
* ఉలవల కషాయం తాగుచున్న కడుపులోని పురుగులు నశిస్తాయి.
పైన చెప్పిన మోతాదులలో చిన్నపిల్లలకు నాలుగోవంతు మాత్రమే ఇవ్వవలెను. చిన్న శొంఠి ముక్క కాల్చి ఉప్పు అద్ది చిన్నపిల్లలకు వారానికి రెండు సార్లు తినిపించిన కడుపులో నులిపురుగులు చనిపోవును.
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషదాలు " అనే గ్రంథం నందు పెద్ద పెద్ద రోగాలకు కూడా అత్యంత సులభ చిట్కాలతో నయం చేసుకునే విధముగా ఇవ్వడం జరిగింది. రోగ కారణాలు , ఔషధాలు , పత్యాలు అన్ని ఒకేచోట ఇచ్చాను.
ఈ గ్రంథంలో అన్ని వైద్య యోగాలు ఇంట్లో ఉన్న వస్తువులు మరియు ఇంటి చుట్టుపక్కల దొరికే మూలికలతో సొంతంగా ఇంట్లొనే తయారుచేసుకునే విధంగా ఇవ్వడం జరిగింది. మొక్కలను సులభంగా గుర్తించుటకు రంగుల ఫొటోస్ ఇచ్చాను. ఆయుర్వేదం పైన అవగాహన ఏర్పరచుకోవాలి మరియు ఆయుర్వేదం నేర్చుకునే వారికి చక్కటి మార్గ సూచీ అవుతుంది. గ్రాంధిక భాష కాకుండా మనం వాడే సాధారణ భాష లో ఉంటుంది.
చెట్లను బట్టి భూమి యందు నీటిని కనుగొనే విధానం , వ్యవసాయంలో అధిక ఫలితాలు సాధించుటకు వృక్షాయుర్వేదం అను ప్రాచీన రహస్య యోగాలు గురించి , పశువుల వైద్య యోగాలు వంటి ఎన్నో అమూల్యమయిన విషయాలు తెలియచేశాను . గ్రంథం మొత్తం 288 పేజీలు ఉంటుంది. ఈ అమూల్య గ్రంథం విలువ 350 రూపాయిలు మాత్రమే .
కేవలం ఆరు నెలలోపే ద్వితీయ ముద్రణ కు వచ్చిన ఈ గ్రంథం కావలసిన వారు డైరెక్టుగా మాత్రమే సంప్రదించగలరు. గత 250 సంవత్సరాల నుంచి మా వంశపారంపర్యంగా వచ్చిన అనుభవ రహస్య వైద్య యోగాలు ఈ గ్రంథంలో సంపూర్ణంగా వివరించాను.
ఈ గ్రంథం కావలసిన వారు డైరెక్టుగా ఫొన్ ద్వారా మాత్రమే సంప్రదించగలరు. సంప్రదించవలసిన నెంబర్
9885030034
కాళహస్తి వెంకటేశ్వరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యం
9885030034
Comments
Post a Comment