సాధారణ చర్మరోగాలు నశింపచేయు సులభ యోగాలు
* వావింటి చెట్టు సమూలం నీటిలో నూరి ముద్దచేసి నువ్వుల నూనె లో ఉడికించి ఆ నూనెని రాయుచున్న సాధారణ చర్మరోగాలు అన్నియు నశించును.
* వేపచెట్టు బెరడు కషాయం సేవించుచున్న చర్మరోగాలు నయం అగును.
* మెట్టతామర ఆకు పసరు , నిమ్మకాయ రసం కలిపి పూసిన సాధారణ చర్మరోగాలు నయం అగును.
* నేలవేము కషాయం సేవించుచున్న సాధారణ చర్మరోగాలు తగ్గును.
* మోదుగ విత్తనాలు నిమ్మరసంతో కలిపి అరగదీసిన సాధారణ చర్మరోగాలు నయం అగును.
* నల్ల ఉమ్మెత్త రసం రాసిన చర్మరోగాలు నయం అగును.
* కొబ్బరినూనెలో గంధకం పొడిని కలిపి పూసిన చర్మరోగాలు నశించును.
* పచ్చగన్నేరు వేరు పైన చర్మం నేతిలో వేసి కాచి ఆ తైలమును రాసిన చర్మవ్యాదులు నశించును.
* ఎర్రగన్నేరు వేరు నేతిలో వేసి మరిగించి ఆ తైలమును పూసిన చర్మరోగాలు నయం అగును.
* కసివిందాకు రసం రాసిన గజ్జి , చిడుము వంటి చర్మరోగాలు నివారణ అగును.
* జిల్లేడాకు రసం, ఆవనూనె , పసుపు కలిపి రాయుచున్న చర్మరోగాలు నశించును.
* నల్లజీలకర్ర, నీలి ఆకులు మెత్తగా నూరి చర్మంపైన పూయుచున్న చర్మరోగాలు నశించును.
* పనస చెట్టు ఆకులు నూరి చర్మవ్యాధులు పైన రాయుచున్న చాలా రకాల చర్మవ్యాదులు నశించును.
* తాటి కల్లుతో బియ్యపు పిండి కలిపి పులియబెట్టి వ్రాస్తుంటే దూరదతో ఉండే చీముపొక్కులు నశిస్తాయి .
పైన చెప్పిన యోగాలలో మీకు ఏది సులభముగా అనిపిస్తే దానిని ప్రయత్నించండి. నా గ్రంథాలలో ఇంకా వివరణాత్మకంగా ఇచ్చాను. ప్రతివ్యాధికి హెడ్డింగ్ పెట్టి కింద చిట్కాలు ఇచ్చాను.
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. ఈ గ్రంథాలలో మొక్కలను సులభముగ గుర్తించుటకు మొక్కల చిత్రాలు రంగులలో ఇవ్వడం జరిగింది.
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది .వెల - 350 రూపాయలు .
ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది. వెల - 450 రూపాయలు కొరియర్ చార్జీలు కలుపుకొని
ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్
9885030034
మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .
కాళహస్తి వేంకటేశ్వరరావు .
అనువంశిక ఆయుర్వేద వైద్యులు .
9885030034
Comments
Post a Comment