మధుమేహం - ఆహారనియమాలు


    మధుమేహం వంశపారంపర్యమైన వ్యాధి . తల్లితండ్రులిద్దరిలో ఒకరికి ఈ వ్యాధి ఉంటే పిల్లలలో ఈ వ్యాధి రావడానికి 50 శాతం అవకాశం ఉంటుంది.  తల్లితండ్రులు ఇద్దరికి ఉంటే నూటికినూరుపాళ్లు పిల్లలకు వస్తుంది.  కావున కొన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నచో మధుమేహం ముప్పు నుంచి కొంత తప్పించుకోవచ్చు.  అవి

*  తీపి పదార్దాలు తినకూడదు.

*  మితాహార నియమాలు విధిగా పాటించాలి .

*  శరీరం బరువు , లావు పరిమితికి మించకుండా చూసుకోవాలి .

*  ప్రతినిత్యం వ్యాయాయం చేయాలి .

*  మానసిక ఒత్తిడిని దూరం పెట్టాలి.

*  కార్టిజోన్స్ , స్టెరాయిడ్స్ వాడరాదు.

*  తరచుగా వైద్యుడి వద్ద పరీక్షలు చేయించుకుని సలహాలు తీసుకోవాలి .

         పైన విషయాలలో తగిన జాగ్రత్త తీసుకుంటే ఈ రోగాన్ని దూరంగా ఉంచవచ్చు.

  పాటించవలసిన ఆహారనియమాలు  -

         అన్నింటిలో మొదటిది క్రమబద్ధమైన నియమిత ఆహార సమయం . వరిఅన్నం తినేవారు గోధుమకు మారవలసిన అగత్యం లేదు . అన్నిరకాల తృణధాన్యాలలో 70 శాతం పిండిపదార్థాలు ఉండటం వలన ఈ మార్పిడి వలన ప్రయోజనం ఏమి లేదు . ఎవరి అలవాట్లకు వారు అణుగుణంగా వారు ఆహారం తీసుకోవచ్చు  అయితే రోగి ఇంతకు పూర్వం తీసుకునే ఆహారపదార్థాల పరిమాణం మాత్రం ఈ వ్యాధి కారణంగా మార్చుకోవలసి ఉంటుంది.

           ప్రోటీన్లు ఎక్కువుగా ఉండే గింజ ధాన్యాలతో అనగా మినుములు , పెసలు, శనగలు , కందులతో చేయబడిన ఆహారపదార్థాలు , పిండిపదార్థాలు ఎక్కువుగా తీసుకోవాలి . వీటిలో తాలింపు పెట్టిన పెసలు , శనగలు లేక నానబెట్టి వాడేసిన పచ్చిశనగలు , పెసలు ఎక్కువుగా తీసుకోవాలి . రోజూ కనీసం ఒక్కసారైనా తీసుకోవటం మంచిది . పీచు ఎక్కువుగా ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల మధుమేహం ఉపశమించటమే రక్తంలో కొవ్వు కూడా బాగా తగ్గుతుంది . గింజధాన్యాలు , కాయగూరలు , ఆకుకూరలు పీచు బాగా కలిగి ఉంటాయి. శనగలు , పెసలు పైతొక్కతో సహా తినటం వలన ఈ విషయంలో మరింత సత్ఫలితం కలుగుతుంది . కాయగూరలు పరిమితి లేకుండా కాయగూరలు .

              కాకరకాయ, చిక్కుడు, ఆనప , బీర, వంకాయ, క్యాబేజీ , కాలిఫ్లవర్ , గుమ్మడి , బూడిదగుమ్మడి , సిమ్లా మిరప, తెల్లముల్లంగి, పోట్ల, మునగ , తొటకూర, గొంగూర, చుక్కకూర , కొత్తిమీర , మునగాకు కూర, పాలకూర మొదలగు అన్ని రకాల ఆకుకూరలు , నీరుల్లి, టొమాటో , దొండ , బెండ, అరటిపువ్వు , అరటిదూట .

           కొవ్వు పదార్దాలు ఎక్కువుగా ఉన్న నెయ్యి , వెన్న , కొబ్బరి నూనె , పామాయిల్ వాడరాదు. కొవ్వు తక్కువ ఉన్న పొద్దుతిరుగుడు గింజల నూనె , నువ్వులనూనె మితంగా వాడవచ్చు . ఆహారం తక్కువ పరిమాణంలో రోజుకి ఎక్కువసార్లు తీసుకోవాలి . లావుగా ఉన్నవారు రోజువారి కేలరీలను కూడా తగ్గించాలి. దుంపకూరలు వాడరాదు.

         ఎట్టి పరిస్థితులలో చక్కెర , తేనె , గ్లూకోజ్ , బెల్లం , స్వీట్స్ , జీడిపప్పు , బాదం , లేతకొబ్బరి , మత్తుపానీయాలు , శీతలపానీయాలు , హార్లిక్స్ , బూస్ట్ వంటి పోషక విలువలు కలిగిన పానీయాలు అరటి , మామిడి, పనస , సపోటా మొదలగు పండ్లు తీసుకోరాదు . ఉపవాసాలు , నిరాహారదీక్షలు చేయరాదు . రక్తంలో చక్కెర స్థాయి పూర్తిగా అదుపులో ఉంటే అవసరాన్ని బట్టి బత్తాయి, ఆపిల్ , పుచ్చకాయ, జామ  , బొప్పాయి , ఉసిరి , కమలాఫలం తినవచ్చు .

ఆహార సమయాలు  -

అల్పాహారం - ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు.

    టొమాటో జ్యూస్ ఒక కప్పు , మొలకెత్తుచున్న గింజలు , రొట్టె లేక చపాతి , పలుచని పాలు పంచదార లేకుండా లేక రాగిమాల్ట్  .

మధ్యాహ్న భోజనం  -

      12 నుండి 1 గంట వరకు.

రాత్రి భోజనం  -

   6 గంటల నుండి 9 గంటల వరకు .

   కలగూర, దోసకాయ, టొమాటో , ముల్లంగి , కాకరకాయ, చిక్కుడు మొదలయిన కూరగాయలు , ఉప్పు , మిరియపు పొడి , నిమ్మకాయ చాలా మంచిది . కూరగాయలు ఉడకపెట్టిన నీరు , గోధుమ అన్నం , గోధుమ రొట్టె , ఆకుకూరలు ముఖ్యంగా ములగ , అవిశ , మెంతికూరలు .

సాయంత్రం అల్పాహారం  -

    3 గంటల నుండి 5 గంటల వరకు

     బొప్పాయి ముక్కలు లేక జామపండు, సాల్ట్ బిస్కేట్స్ , పలచని పాలు లేక రాగిమాల్ట్ పంచదార కలపకుండా వాడవచ్చు .

     మామిడి, అరటి, పిండిపదార్థాలు , ఎక్కువ ఒకేసారి కడుపు నిండగా తినవద్దు.

   గమనిక  -

      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. ఈ గ్రంథాలలో మొక్కలను సులభముగ గుర్తించుటకు మొక్కల చిత్రాలు రంగులలో ఇవ్వడం జరిగింది.

      ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది .వెల  - 350 రూపాయలు .

      ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384    పేజీలు ఉంటుంది. వెల - 450 రూపాయలు  కొరియర్ చార్జీలు కలుపుకొని

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్
                  
                        9885030034

         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

                  కాళహస్తి వేంకటేశ్వరరావు .

              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .

                          9885030034

Comments

Popular posts from this blog

మంత్రశక్తి గురించి వివరణ - మంత్రసిద్ధి

సొంటి చేసే మేలు

ఉప్పుకు ప్రత్యామ్నాయం సైన్డవలవనం