మధుమేహా నివారణ కొరకు ఆయుర్వేదం నందలి రహస్యయోగాలు

*  రాచఉసిరి కాయలు ఎండించి వాటి చూర్ణం చేసి దానికి సమానంగా పసుపు కలిపి ఈ చూర్ణాన్ని ఉదయం , సాయంత్రం అరచెంచాడు చొప్పున తీసుకొనుచున్న మధుమేహం తగ్గును.

*  ప్రతినిత్యం అరటి పువ్వును అల్పాహారంగా తినుచున్న మధుమేహరోగం తగ్గును.

*  నల్లతుమ్మ బెరడు చూర్ణం ప్రతి నిత్యం అరచెంచాడు గాని , లేదా నల్ల తుమ్మ జిగురు అరచెంచా , అరకప్పు నీటిలో కలిపి తాగుచున్న మధుమేహం తగ్గును.

*  మర్రిచెట్టు బెరడు చూర్ణం అరచెంచా గాని లేక బెరడును కషాయంలా చేసుకుని ఒక పావుకప్పు రోజూ తీసుకొనుచున్న మధుమేహం నిశ్చయంగా తగ్గును. చాలా మంచి మందు.

*  ఉసిరికాయ కషాయం లేక ఉసిరిగింజల కషాయం రోజుకి అరకప్పుచొప్పున తాగవలెను.

*  లేత మామిడి ఆకులు ఎండించి చూర్ణం చేసి దాన్ని రోజుకి అరచెంచా చొప్పున తీసుకొనుచున్న మధుమేహం తగ్గును.

*  బూరుగ చెట్టువేళ్ళ చూర్ణం అరచెంచాడు ఒక గ్లాసు నీటిలో కలిపి తీసుకొనుచున్న మధుమేహం తగ్గును.

*  ప్రతినిత్యం త్రిఫల చూర్ణం రాత్రి సమయంలో ఆహారం తీసుకున్న రెండు గంటల తరువాత ఒక కప్పు గోరువెచ్చటి నీటిలో కలిపి తాగుచుండవలెను . ఇది తాగుచున్నంతవరకు మధుమేహాం రాదు .

        చాలా మంది త్రిఫలా చూర్ణం అనగా కరక్కాయ , తానికాయ , ఉశిరికాయ సమాన భాగాలు అనుకుంటారు . బయట ఆయుర్వేద దూకాణాల్లో కూడా ఇదే మోతాదులలో కలిపి లభ్యం అగును. అసలైన త్రిఫలా చూర్ణం చేయు విధానాన్ని ఇప్పుడు మీకు వివరిస్తాను.

               కరక్కాయ పెచ్చులు ఒక భాగం , తాటికాయ రెండు భాగాలు , ఉసిరికాయ గింజల చూర్ణం నాలుగు భాగాలు తీసుకుని దేనికదే విడిగా చూర్ణం చేసి అన్ని కలుపుకుని ఒకే చూర్ణంగా ఒక గాజుసీసాలో నిలువచేసుకోవాలి . దీనిని ప్రతినిత్యం రాత్రి సమయం నందు ఒక కప్పు నీటిలో కలిపి వాడుకోవాలి . ఇది మదుమేహం రాకుండా అద్బుతంగా కాపాడును.

నేను మధుమేహం తగ్గించుటకు ప్రయోగించిన విధానాలు  -

*  మదుమేహం 250 నుంచి 300 మధ్యలో ఉన్నప్పుడు 9 మారేడు ఆకులు ఉదయాన్నే పరగడుపున రాత్రి ఆహారానికి గంట ముందు తినిపించాను. మధ్యాహ్నం మజ్జిగ అన్నంలో 50 గ్రాముల ఉల్లిపాయ ప్రతి నిత్యం తినిపించాను. బయటకు వెళ్ళు సమయంలో చిన్న దాల్చినచెక్క ముక్క నోటిలో వేసుకొని చప్పరించామని చెప్పాను . వేడిని పెంచే ఆహారం తగ్గించాను. ఈ విధానంలో 20 రోజులలోనే మధుమేహం 180 వరకు వచ్చింది. ఆ తరువాత 6 మారేడు ఆకులు తినిపించాను. ప్రస్తుతం మధుమేహం మాములు స్థాయికి వచ్చింది.

              మరొక వ్యక్తికి నీడలో ఎండించి చూర్ణం చేసిన నేరేడు గింజల చూర్ణం , ఒక స్పూన్ పొడపత్రి చూర్ణం ఉదయాన్నే ఒక గ్లాసు గొరువెచ్చటి నీటిలో వేసి అలా ఉంచి రాత్రి ఆహారానికి గంట ముందు ఆ కషాయాన్ని తాగించాను. మరలా రాత్రి సమయము నందు పైన చెప్పిన మోతాదులోనే మరొక గొరువెచ్చటి చిన్న గ్లాసు నీటియందు చూర్ణాలు వేసి ఉదయాన్నే పరగడుపున తాగించాను . అతికొద్ది సమయంలోనే మధుమేహం పూర్తినియంత్రణ లోకి వచ్చింది. 

        మధుమేహం లో వచ్చు అతిమూత్రవ్యాధికి నీడలో ఎండించిన తంగేడు పువ్వులను 10 తీసుకుని ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించి ఉదయం మరియు సాయంత్రం తీసుకొనుచున్న అతిగా మూత్రం పోవడం తగ్గును.

    గమనిక  -

      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. ఈ గ్రంథాలలో మొక్కలను సులభముగ గుర్తించుటకు మొక్కల చిత్రాలు రంగులలో ఇవ్వడం జరిగింది.

      ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది .వెల  - 350 రూపాయలు .

      ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384    పేజీలు ఉంటుంది. వెల - 450 రూపాయలు  కొరియర్ చార్జీలు కలుపుకొని

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్
                  
                    

         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

                  కాళహస్తి వేంకటేశ్వరరావు .

              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .

                         

Comments

Popular posts from this blog

మంత్రశక్తి గురించి వివరణ - మంత్రసిద్ధి

సొంటి చేసే మేలు

ఉప్పుకు ప్రత్యామ్నాయం సైన్డవలవనం