Posts

Showing posts from November, 2019

శ్రీపాద శ్రీవల్లభ చరితామృత మహిమ- 2

🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము  - 52 🌹 ✍. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు 📚. ప్రసాద్ భరద్వాజ అధ్యాయము-7  🌴. ఖగోళముల వర్ణనము - 2 🌴 🌻. శ్రీపాద శ్రీవల్లభ చరితామృత మహిమ- 2 🌻 ఆ పూజా మందిరములో నున్న శ్రీపాదులు వారు నరసావదానులకును, అతని ధర్మపత్నికిని హితోపదేషములు చేసిరి. ఈ హితోపదేషములు దత్త భక్తులన్దరకునూ ఎంతో ప్రయోజనకరమైనవి. నరసావధానులకును, శ్రీవల్లభుల వారికిని ఈ ప్రకారముగా సంభాషణ జరిగినది. 🌻. నరసావధానులకు, వారి పూజామందిరమందున్న శ్రీపాద శ్రీవల్లభులకు మధ్య సంభాషణ - నరసావధానులకు శ్రీపాదుల వారి ఉపదేశములు. 🌻 ప్రశ్న : నీవెవరవు? దేవతవా? యక్షుడవా? మాంత్రికుడవా?  ఉత్తరం : నేను నేనే! పంచభూతాత్మకమైన యీ సృష్టిలోని ప్రతీ అణువణువునందునూ అంతర్లీనముగా నున్న ఆద్యశక్తిని నేనే!పశుపక్ష్యాదులు లగాయితూ సమస్త ప్రాణికోటి యండుననూ మాతృస్వరూపముగాను, పితృస్వరూపముగానూ ఉన్నది కూడా నేనే! సమస్త సృష్టికిని గురుస్వరూపము కూడా నేనే! ప్రశ్న : అయితే నీవు దత్తప్రభువు యొక్క అవతారమా? ఉత్తరం : నిస్సంశయముగా నేను దత్తుడనే! మీరు శరీరధారులు కనుక మీరు గుర్తించటానికి వీలుగా మాత్రమే నేను సశరీరుడనై వచ్చితిని. వాస్తవమ...