బ్రహ్మవిద్యలో మానస పూజా విధానం


   మానసపూజ :

ఈశ్వర ఉవాచ-

మానస పూజచే కల్గుమహిమలు, అద్భుతములు, ఏమనిచెప్పను,
ఏక ధ్యానములేదు, అంగన్యాస, కరన్యాసకరతంత్రములు చేసే అవసరంలేదు, చక్కగా
ను
స్నానంచేయుట,మంచి ఆసనము మంచి చోట కూర్చొట్లను ఎప్పుడూ కోరదు, ఈ
మానసపూజ శుద్ధమగు పానీయములతో, భోజనము, భోజనముతో తినదగు
పదార్ధములను కోరదు,బ్రహ్మానికి వీటన్నింటితో పనిలేదు.

'ఈ పూజ ఎవరెవరు చేయవచ్చు?'

భార్యాబిడ్డలు గలవారెవ్వరైనా ఏకులంవారైనా ఏవయస్సువారైనా ఈ మానస
పూజను వశము చేసుకోవచ్చును. మానసారాధనకన్నమించిన గొప్ప మంత్రము లేవీ 
లేవు. అలాంటి మంత్రములను కనిపెట్టినవారూ లేరు. అన్నిలోకములలో
వాడుకలో లేనిది,రహస్యముగా ఉంచబడినట్టి విద్యను, నరలోకంలోని జనుల సాధన
కొరకు నీవు అడిగావు కావున వినుము ఈ విద్యను సాధింపుము.
'ఈ పూజకు ఏమేమి కావాలి, ఎలా అర్చించాలి? '

ఎలాంటి రూపము, పేరు, ఎలాంటి పనులు లేనట్టిదగు మహాగొప్ప తేజస్సుతో
వెలుగుచున్న జ్యోతికి, నేను చేయు ఉపచారములు, పూజలో చేయుపనులు శాశ్వతముగా
నుండుగాక. 
1.గొప్ప సముద్రములు, నదులు, ఉపనదులందలి గొప్ప జలములన్నీ
నీకు అభిషేకముగా, 
2. మట్టి, రాళ్ళు, చెట్లు, జంతువులు వీటితో కూడిన 14లోకంబులు
నీకు గంధముగా. 
3.నక్షత్రములు, గ్రహములు, ద్వాదశ రాసులు గొప్పమండలాలతో
మహామేరుపర్వత ధూళితో కూడిన అకాశమునీకు పుష్పంబుగా. 
4. ఆకాశంలో
ప్రవేశించి, ప్రవేశింపలేక అన్ని దిక్కులకు గిరగిరా తిరుగుతూ,సన్నని రేణువులతో
ఆకాశమునకెగయు వాయువు నీకు ధూపంబుగా. 5.సమస్త జీవులందలి అగ్ని నీకు
దీపంబుగా పంచభూతముల కలయికతో నిర్మితమైన, నేనేనీకు ప్రసాదముగా నన్ను
నేనర్పించుకొంటున్నాను దేవా, భక్తరక్షకుడవై రక్షించుము పరమాత్మా సాష్టాంగ
దండప్రమాణములు శ్రీ విశ్వబ్రహ్మార్పణమస్తు అంటూ ఆత్మపూజను చెప్పుకోవలయును.
శిష్యా నీకళ్ళతో చూస్తూ మానకుండా పూజించు, బయట ఏమంత్రములతో పనిలేదు.
నీవే జ్యోతివై సృష్టికర్త ప్రతిరూపమై ఉన్నావు. ఈ పూజనువదలవద్దు బ్రహ్మాన్ని చేరు
మార్గమిదే, యిందులో ఏమాయలూ లేవు.
ఈ పూజచేసే జ్ఞానులు వేరే ఎలాంటి పూజలు చేయరు. వారికి అంతాదివ్య ప్రకాశమే
గోచరించును అంతరదృష్టిలోగల జ్యోతి స్వరూపుడు నీ లోను,నాలోను బయలందు,
సంపూర్ణంగా ఆమహాప్రకాశము అన్నిలోకములందు నిండియున్నది.

ఈశ్వర ఉవాచ : ఈ ఆత్మపూజ చేసేవారికి ప్రతీపూటా నేనే మ్రొక్కుతుంటాను,
యిది యదార్ధము అలాంటి పుణ్యాత్ములు ఏలోకంలోని వారైనా,నేను కంటికి రెప్పవలే
కాపాడుతుంటాను.

ఈశ్వర ఉవాచ:: 

 నీ నేత్రంబులతో గని మానక పూజింపువెలినిమంత్రంబేలా!

        తానే వెలుగై యుండగ మానకుమా బ్రహ్మపధము      

                             మాయలు లేవే||

ఈ పూజ చేయుజ్ఞానులు ఎలాంటి విగ్రహారాధన పూజలు చేయరు. ఈ మానసపూజలో
కంటి చూపుతో అంతా వెలుగే కనబడుతుంది. ఈ వెలుగే విశ్వబ్రహ్మము యిది సృష్టి
అంతా నిండియున్నది. ఎక్కడా సూదిమొనమోపునంత సందు కూడా లేకుండా
జగత్తునంతా నిండియున్నది. ఈ యోగము బ్రహ్మ విష్ణు రుద్రాదులకు జీవనాధారము.
దీనికి ప్రమాణము.🙏🕉️🙏

🕉️🕉️🕉️🙏🕉️🕉️🕉️

మనిషి గాడిద చాకిరీ చేసి 
ఆస్తిపాస్తులను కూడగట్టుకోవడం

ఆస్తి పాస్తులు కూడబెట్టుకున్న తర్వాత 
వాటికి కాపలాగా ఉండటం కుక్కలాగా

వ్యాకుల చిత్తానికి ఆధ్యాత్మికతేశరణ్యం!

ధనం, పదవి, భోగం, ఐశ్వర్యం అన్నీ పొందాక మనిషి ఏం చేయాలి? అన్న ప్రశ్నకు వాటిని కాపలాకాస్తూ జీవించడమే అన్న సమాధానం వస్తుంది. 

భిన్నమైన జీవనవిధానంలో కోరికలూ అనేకం. 
అవి నిరంతరం సంఘర్షిస్తూనే ఉంటాయి. 
వాటికి ఎక్కడా శాంతి లేదు. హద్దు అసలే లేదు. 
దీని వల్ల సంఘర్షణ మొదలవుతుంది. 

సాధనసమయంలో ఏకాంతంగా, మౌనంగా ఉండాలని మన పెద్దలు, శాస్త్రాలు చెప్పడంలోని అంతరార్థం ఇదే. ఎప్పుడైతే అంతర్ముఖులం అవుతామో సరస్సు అడుగు భాగంలో మెరిసే ఆల్చిప్పల్లా మన అంతరంగం అంతా మనకు కనిపిస్తుంది. మాలిన్యాలూ కన్పిస్తాయి. ఆ మాలిన్యాలే సంఘర్షణలు. వాటి నివారణకు భాగవత తత్వాన్ని అనుసరించాలి.

‘‘దారిద్య్రదుఃఖజ్వరదాహితానాం

మాయాపిశాచీపరిమర్దితానామ్‌

సంసారసింధౌ పరిపాతితానాం

క్షేమాయ వై భాగవతం ప్రగర్జతి’’

దారిద్య్రం, దుఃఖం, జ్వరం, మాయ, సంసారం - ఇలా అన్నింటినీ సులభంగా కడతేర్చే ఉపాయం భాగవతం అంటుంది శాస్త్రం. ఇక్కడ భాగవతం అంటే భగవత్తత్వం. భక్తి, జ్ఞాన, వైరాగ్య, తత్వ, ముక్తిని కలిగించేదని అర్థం.

జగన్మంగళమైన భగవత్తత్వం తెలుసుకోవడమే యోగం. జగత్తంతా వ్యాపించిన పరమాత్మ.. ఉపాధితో కూడిన జీవుడిలోనూ ఉన్నాడు. సెల్‌ఫోన్‌తరంగాలు అంతటా వ్యాపించి ఉన్నాయి. వాటిని పట్టుకోవాలంటే ఏదైనా సెల్‌, అందులో సిమ్‌కార్డ్‌, ఆ ఫోన్‌లో నిక్షిప్తమై ఉన్న చార్జింగ్‌ అవసరం. 
అలాగే జీవుడి ఉనికిగా ఉన్న 
దేహం, 
శ్వాస, 
ఆత్మ ఈ మూడూ ఆ పరమాత్మతో అనుసంధానమైతేనే ‘యోగం’ జరుగుతుంది. కాబట్టి మొదట అంతటా వ్యాపించిన పరమాత్మను ఎలా పట్టుకోవాలో తెలిపే బ్రహ్మవిద్యను గుర్తెరగాలి. 

సర్వభూతాంతర్యామి అయిన పరమపురుషుని నిత్యత్వాన్ని ప్రాజ్ఞులైనవాళ్లు తలచుకొని మనస్సులో ఎల్లప్పుడూ ధ్యానిస్తూనే ఉంటారు. ఆ సంప్రజ్ఞత మనలో ఉంటే చేసే ఏ కర్మ అయినా అది భగవద్దత్తమే. పూజలో, జపంలో, తపస్సులో, యజ్ఞంలో, పఠనంలో, శ్రవణంలో, యోగంలో అన్నింటిలో ఆ పరాతత్వ దర్శనం జరిగి తీరుతుంది. దానితో అనుసంధానం లేని ఎంత గొప్ప అనుష్ఠానమైనా వృధాప్రయాసే. ఎప్పుడైతే విరాట్పురుషుని విస్మృతి లేకుండా భజిస్తామో ‘వ్యాకులచిత్తం’ వ్యాసచిత్తంగా మారుతుంది.

మనస్సులోని సంఘర్షణలు మాయమైపోయేందుకు ఆధ్యాత్మిక దర్శనం జరగాలి. 

అదే బ్రహ్మవిద్య. ‘అహం బ్రహ్మాస్మి’ అని ధైర్యంగా ప్రకటించాయి ఉపనిషత్తులు. 

అది ఎవరూ మెరుగులు దిద్దలేని వేదాంత నినాదం. అవతలివైపు ఇంకేమీ లేదని చెప్పే మహత్తర సందేశం. అలాంటపుడు క్షుద్రమైనవేవీ మనసును తాకలేవు. ఎలాంటి ద్వంద్వ రూప భావాలను, లౌకిక విషయాలను కలిగించని మహోన్నతస్థితి... మనలోని రహస్యమైన అస్తిత్వాన్ని గొప్పగా విస్తరించుకునే దివ్యశక్తి... ఆధ్యాత్మికత. అది లభ్యమైన తక్షణం అన్నీ మటుమాయం.
.

(సేకరణ)(ఆదిత్యనారాయణ)(తిప్పానా)

Comments

Popular posts from this blog

మంత్రశక్తి గురించి వివరణ - మంత్రసిద్ధి

సొంటి చేసే మేలు

ఉప్పుకు ప్రత్యామ్నాయం సైన్డవలవనం