బ్రహ్మవిద్యలో మానస పూజా విధానం
మానసపూజ : ఈశ్వర ఉవాచ- మానస పూజచే కల్గుమహిమలు, అద్భుతములు, ఏమనిచెప్పను, ఏక ధ్యానములేదు, అంగన్యాస, కరన్యాసకరతంత్రములు చేసే అవసరంలేదు, చక్కగా ను స్నానంచేయుట,మంచి ఆసనము మంచి చోట కూర్చొట్లను ఎప్పుడూ కోరదు, ఈ మానసపూజ శుద్ధమగు పానీయములతో, భోజనము, భోజనముతో తినదగు పదార్ధములను కోరదు,బ్రహ్మానికి వీటన్నింటితో పనిలేదు. 'ఈ పూజ ఎవరెవరు చేయవచ్చు?' భార్యాబిడ్డలు గలవారెవ్వరైనా ఏకులంవారైనా ఏవయస్సువారైనా ఈ మానస పూజను వశము చేసుకోవచ్చును. మానసారాధనకన్నమించిన గొప్ప మంత్రము లేవీ లేవు. అలాంటి మంత్రములను కనిపెట్టినవారూ లేరు. అన్నిలోకములలో వాడుకలో లేనిది,రహస్యముగా ఉంచబడినట్టి విద్యను, నరలోకంలోని జనుల సాధన కొరకు నీవు అడిగావు కావున వినుము ఈ విద్యను సాధింపుము. 'ఈ పూజకు ఏమేమి కావాలి, ఎలా అర్చించాలి? ' ఎలాంటి రూపము, పేరు, ఎలాంటి పనులు లేనట్టిదగు మహాగొప్ప తేజస్సుతో వెలుగుచున్న జ్యోతికి, నేను చేయు ఉపచారములు, పూజలో చేయుపనులు శాశ్వతముగా నుండుగాక. 1.గొప్ప సముద్రములు, నదులు, ఉపనదులందలి గొప్ప జలములన్నీ నీకు అభిషేకముగా, 2. మట్టి, రాళ్ళు, చెట్లు, జంతువులు వీటితో కూడిన 14లో...